Wednesday, February 18, 2009

నేనే ఢాం! నేనే ఢాం!!

బిరడాబర్మ కొలువు తీరి ఉండగా ఒక శిష్యుడు హడావుడిగా పరిగెత్తుకొచ్చాడు. ఏదో గొప్ప ఆవేశంలో ఉన్నట్టున్నాడు. ఐనా వచ్చి బిరడాతో బర్మకి వందనం చేశాడు.
బిరడాబర్మ చిరునవ్వుతో నా సుద్దల నీ బిరడా అని ఆశీర్వదించాడు.
ఐనా శిష్యుడి ఆవేశం తగ్గలేదు.
బర్మ కూల్‌గా చూసి శిష్యా ఆవేశ పడకు ఏం జరిగిందో వివరంగా చెప్పు అన్నాడు.
బిరడా ఏం చెప్పను బిరడా నువ్వే మాకందరికీ దిక్కని నమ్ముకున్నామే ఇవ్వాళ్ళ నీ దివ్య బిరడత్వాన్ని సవాలుచేసే దుష్టశక్తొకటి పుట్టుకొచ్చిందని ఎలా చెప్పను బిరడా అని ఆక్రోశంతో అరిచాడు.
శాంతించు నాయనా ఎవరా దుష్టశక్తి ఎక్కడుంది అన్నాడు బిరడాబర్మ.
ఉంది కాది బిరడా ఉన్నాడు. ఎవడో ఢాం అంట. ఆ బ్లాగులోకపు చీకటులు పారదోలే రవి వాడేనంట. దుర్ర్ గంధ వ్యాప్తితోనే ప్రక్షాళన చేస్తాడంట. మొత్తం మన ఎజెండా అంతా కాపీ కొట్టేశాడు బిరడా అని గోడు పెట్టుకున్నాడు శిష్యుడు.
శిష్యా పాపిష్టి బ్లాగులోకంలో కాపీ అనేది కొత్త కాదు. ఎంత విరివిగా దుర్ర్ గంధం వ్యాపిస్తే అంత త్వరగా బ్లాగ్జనుల కళ్ళు తెరుచుకుంటై. మన కార్యక్రమాన్ని ఎందరు చేబట్టి తమ శక్తి మేరకు దుర్ర్ గంధ వ్యాప్తి చేస్తే అంత మేలు జరుగుతుంది. కానీ వాడు నా శరణు జొచ్చి నా శిష్యుడై ఈ పని చేస్తే బాగుండేది. ఇలా పీతిబొక్కలోంచి ఊడిపడ్డ ప్రతి కుత్తాకమీనాగాడు నేనే రవిని శశిని అనుకుంటూ బయల్దేరితే నేను సహించను. ఇట్లాంటి పుట్టగొడుగుల మధ్యలో నా బిరడాత్వం ఏం కావాలి పదండి వాడి అంతు చూద్దాం అని బిరడాబర్మ ఒక్క ఉదుటున ఉవ్వెత్తుగా లేచి యుద్ధోన్ముఖుడై కదిలాడు.

దారి మధ్యలో శిష్యుడు ఢాం గురించి తను విన్నది చూసింది అంతా బిరడాకి చెప్పాడు. ఆ ఢాం గాడు మామూలు సాధారణ వ్యక్తుల్లానే ఉంటాడు, కానీ అప్పుడప్పుడూ ఏదో శక్తి పూనినట్టు గంతులేసి నేనే ఢాం, నేనే ఢాం అని అరుస్తాడు. ఆడు ఢాం అన్నప్పుడల్లా ఆడి యెనకమాల్నించి పెద్ద సౌండొస్తది. సౌండుతో పాటు దుర్ర్ గంధం పుట్టుకొస్తాది.

ఆహా అట్టైతే ఒక పంచెద్దాం. నువ్వు వాడి బోధన యినేందుకొచ్చినట్టుగా యాక్టింగు చెయ్యి. నేను యేమీ యెరగనట్టుగా ఆడి యెనకమాల నించూని ఆడి సంగతేందో పట్టుకుంటా అన్నాడు బిరడా బర్మ.

ఇద్దరూ ఢాం దగ్గరికి చేరారు.
అది హైదరాబాదులో ఒక పాడుబడిన కాల్‌సెంటరు. ఢాం అనబడే వ్యక్తి ఒక డొక్కు కంప్యూటర్ ముందు కూర్చుని మానిటర్లోకే తదేకంగా చూస్తున్నాడు. మధ్య మధ్య అస్పష్టంగా ఏదో గొణుగుతున్నాడు.
సరిగ్గా వినబడ్డం లేదు కానీ ,,దోస్ ,, ,,, నుండల్ ,,,ఈ తెలు,,, ,, విగాడు,, ,,,విస్పష్ట ,,,,, అంటూ వినిపిస్తున్నాయి.
బిరడా శిష్యుడు వెళ్ళి వాడి ముందు నిలబడ్డాడు గానీ వాడదేం పట్టించుకోలేదు. ఢాం దృష్టి పూర్తిగా కంప్యూటరు మీదనే ఉంది, తనకేం భయం లేదు అనుకున్నాక బిరడాబర్మ మెల్లగా ఢాం వెనక్కి చేరుకుని అక్కడే సెటిలయ్యాడు.
వాళ్ళు ఎక్కువ సేపు వేచిఉండాల్సిన అవసరం లేకపోయింది.
ఉన్నట్టుండి ఢాం చలిజ్వరమొచ్చిన వాడిలా వణకడం మొదలెట్టాడు.
వచ్చేస్తోంది వచ్చేస్తోంది అనుకున్నాడు బిరడాబర్మ.
ఢాం ఒక్కసారిగా సవాల్ అని కేకపెట్టి ముడ్డిలో శూలదిగినోడికిమల్లే కుర్చీలోంచి ఒక్క సారి పైకెగిరాడు.
బిరడాబర్మ ఉలిక్కిపడి థూనాబిరడా అని వీపు తట్టుకున్నాడు.
ఢాం అక్కడ పూనకమొచ్చినట్టు ఊగిపోతన్నాడు.
ఇదిగో వచ్చేస్తది ఇప్పుడే ఇప్పుడే అనుకుంటా ఆత్రుతగా ఎదురు చూస్తున్నాడు బిరడాబర్మ.
నేనే ఢాం అని గట్టిగా అరిచాడు ఢాం.
ఆడెనకాల మాత్రం తుస్స్ మని చిన్న పిత్తొచ్చింది.
ఏదో ప్రళయంలాగా బ్రమ్మాండం బద్దలైతదని ఎదురు చూస్తంటే ఈ ఢాం గాడు ఢామ్మనకుండా తుస్సుమనేప్పటికి బిరడాబర్మకి బిరడాచివరికంటా కాలింది.
థూ నీ తుస్సుగాలి నా ముక్కుల యెంటికని కూడా కదల్చలేదు కదబే అని మహా కోపంతో కాలెత్తి ఢాం ముడ్డిమీద ఒక్క తన్ను తన్నాడు.
అప్పుడు ఢాం అని పేద్ధ శబ్దమయింది.
సశేషం

No comments: